ఆస్కార్ రేస్ లో దిగనున్న చిత్రాలు ఇవే..

23 September 2023

మంచి కంటెంట్‌ను అదే రేంజ్‌లో ప్రమోట్‌ చేయగలిగితే మన సినిమా కూడా విశ్వ వేదిక మీద సత్తా చాటుతుందని ప్రూవ్ చేసింది. దీంతో ఈ ఏడాది ఆస్కార్ ఎంట్రీ విషయంలో ఆల్రెడీ బజ్‌ మొదలైంది.

ఆస్కార్

ఇండియన్ సినిమా నాటు బీటును విశ్వ వేదిక మీద వినిపించిన ట్రిపులార్ టీమ్‌, అప్‌ కమింగ్ సినిమాలకు కొత్త జోష్ ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్

ఇన్నాళ్లు మన సినిమా ఆస్కార్‌ వరకు వెళుతుందా? అన్న అనుమానాలను పక్కన పెట్టి మనకేం తక్కువ అని ఆలోచించే రేంజ్‌కు మన సినిమాకు తీసుకువచ్చింది.

ఆర్ఆర్ఆర్

ఈ ఏడాది ఆస్కార్ బరిలో ట్రిపులార్ జయకేతనం ఎగురవేయటంతో వచ్చే ఏడాది ఆస్కార్ బరిలో నిలిచేందుకు మరిన్ని సినిమాలు పోటి పడుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ ఆస్కార్

తాజాగా ఆస్కార్‌కు ఇండియన్‌ అఫీషియల్ ఎంట్రీని సెలెక్ట్ చేసే పని మొదలైంది. ఈ పోటిలో తెలుగు సినిమాల పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.

ఆస్కార్

చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన బలగం సినిమాతో పాటు నాని కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమాగా నిలిచిన దసరాను ఆస్కార్‌కు పంపే ప్రయత్నాల్లో ఉన్నాయట ఆ మూవీ టీమ్స్‌.

టాలీవుడ్

వీటితో పాటు బాలీవుడ్‌ నుంచి రీసెంట్‌ హిట్ రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ, ది స్టోరి టెల్లర్‌, మ్యూజిక్‌ స్కూల్‌, మిస్ ఛటర్జీ వర్సెస్‌ నార్వే సినిమాలను బరిలో దించే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్‌.

బాలీవుడ్‌

వీటితో పాటు కొన్ని తమిళ, మరాఠి సినిమాలు కూడా ఆస్కార్ ఎంట్రీ విషయంలో పోటి పడుతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా పోటికి అర్హత సాధిస్తుందో చూడాలి.

తమిళ, మరాఠి సినిమాలు