నవంబర్ చివరి వారంలో థియేటర్/ ఓటీటీలో అలరించనున్న చిత్రాలు..

20 November 2023

వైష్ణవ్ తేజ్, శ్రీలీలే జంటగా తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ చిత్రం ‘ఆదికేశవ’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ముఖ్య భూమికగా రూపొందిన 'కోటబొమ్మాలి పిఎస్' నెల 24న విడుదల కానుంది.

విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ధృవ నక్షత్రం’ సినిమా ఎట్టకేళకు ఈ నెల 24న రిలీజ్ కు సిద్ధం అయింది.

చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జోడిగా రూపొందిన స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ నవంబర్ 24న థియేటర్స్ లో సందడి చేయనుంది.

తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘మాధవే మధుసూదన’ ఈ నెల 24న అలరించనుంది.

హాలీవుడ్‌ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ చిత్రం 'ఒప్పైన్‌ హైమర్‌' బుక్ మై షో ద్వారా నవంబరు 22న ప్రసారం కానుంది.

ఐశ్వర్య రాజేష్, జోజు జార్జ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'పులిమడ సెంట్ అఫ్ ఏ ఉమెన్' చిత్రం నవంబరు 23 నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా స్ట్రీమింగ్ కానుంది.

అమెరికన్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ 'గ్రాన్‌ టురిస్మో' నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా నవంబర్ 25న తెలుగులో ప్రేక్షకులను అలరించనుంది.