సెప్టెంబర్ చివరివారంలో థియేటర్/ఓటీటీలో అలరించనున్న చిత్రాలు..
25 September 2023
లారెన్స్, కంగన రనౌత్ ప్రధాన పాత్రల్లో సీనియర్ దర్శకుడు పి వాసు తెరకెక్కిస్తున్న సినిమా ‘చంద్రముఖి 2’.సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్, శ్రీలీల జోడిగా నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘స్కంద’ సెప్టెంబర్ 28న ప్రేక్షకులను అలరించనుంది.
కరోనా సమయంలో దేశంలో పరిస్థితులను చూపించున్న చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘పెదకాపు 1’. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమా సెప్టెంబర్ 29న వీక్షకుల ముందుకు రానుంది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన స్పై త్రిల్లర్ చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఈ చిత్రం తాజాగా సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన గ్యాంగ్ స్టర్ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. ఈ సినిమా సెప్టెంబరు 28న డిస్నీ+హాట్‌స్టార్ లో అలరించనుంది.
అఖిల్ స్పై యాక్షన్ మూవీ ‘ఏజెంట్’ ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధమైంది. సెప్టెంబరు 29 నుంచి సోనీలివ్ ద్వారా విడుదల కానుంది.
DC నుంచి వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో చిత్రం ‘బ్లూ బీటిల్’. ఈ చిత్రం సెప్టెంబరు 29 నుంచి బుక్ మై షో వేదికగా ప్రసారం అవ్వనుంది.