అక్టోబర్ చివరి వారంలో థియేటర్/ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు..

24 October 2023

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్‌’ ఈ నెల 27న థియేటర్ లో సందడి చేయనుంది.

భారతీయ వైమానిక దళం పైలట్ తేజస్ గిల్ బయోపిక్ గా వస్తున్న చిత్రం ‘తేజస్‌’. కంగనా టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమా అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ హీరోగా రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకులను అలరించనుంది.

హృతిక్‌ శౌర్య, తన్వి నేగి జోడిగా తెరకెక్కిన సినిమా ‘ఓటు’ చాలా విలువైనది.. ఉపశీర్షికతో ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘చంద్రముఖి 2’. ఈ చిత్రం ఈ నెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారం కానుంది.

హాలీవుడ్ సినిమా ‘ట్రాన్స్‌ఫార్మార్స్‌ ది: రిజ్ అఫ్ బిష్ట్స్’ అక్టోబరు 26 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా డిజిటల్ లో విడుదల కానుంది.

బయపటిపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘స్కంద’ ఈ 27 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా రిలీజ్ కానుంది.

రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన కొరియన్ చిత్రం 'కాస్ట్‌వే దివా'. ఈ సినిమా ఈ నెల 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.