ఇషా అంబానీ ఇంట హోలీ వేడుక.. సినీ తారల సందడి
TV9 Telugu
19 March 2024
భరతదేశంలోనే అపర కుబేరుడు అయినా ముకేశ్ అంబానీ ఇంట మరోసారి సందడి నెలకొంది. మళ్లీ ఏమి ఈవెంట్ అని అనుకుంటున్నారా.?
అంబానీ ముద్దుల తనయ, రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ తన ఇంట్లో హోలీ వేడుక నిర్వహించింది.
ఈ పండగ వేడుకకు బాలీవుడ్ ఇండస్ట్రీ తారలంతా హాజరై డిజైనర్ వేర్‌తో, ట్రెండీ జ్యువెల్రీతో సందడి చేశారు.
ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమెకి అనంత్ అంబానీతో ఇటీవల వివాహం జరిగింది.
శాటిన్ డ్రెస్‌లో ఆకర్షించిన రాధిక మర్చంట్ రెండు లేయర్ల ఎమరాల్డ్ నెక్లెస్ ధరించి సింపుల్ మేకప్‌తో ఎంతో అందంగా కనిపించింది.
ఇక రాధిక ధరించిన నెక్లెస్ ఖరీదు కొన్ని కోట్ల రూపాయలట . అంబానీ కోడలా మజాకానా అంటూ ఫ్యాషన్ ప్రియులు అనుకుంటున్నారు.
ఇదే వేడుకలో ఇషా అంబానీ ప్రత్యేక డిజైనర్ గౌనులో మెరిసింది. ఆమె ధరించిన డ్రెస్‌ను డిజైన్ చేసేందుకు ఏకంగా 100 గంటలు పట్టిందట.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సైతం గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన చీరతో స్టన్నింగ్ లుక్‌తో కనిపించింది. ఇతర తారలు కూడా మెరిసిపోయారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి