2024లో నెంబర్ వన్ చైర్ టాలీవుడ్‌కు మళ్లీ తిరిగొస్తుందా..?

09 November 2023

ఉందిలే మంచికాలం ముందుముందునా అంటూ పాడుకుంటున్నారు మన దర్శక నిర్మాతలిప్పుడు. దానికి కారణం కూడా లేకపోలేదు.

2024లో రాబోయే సినిమాలు అలా ఉన్నాయి మరి. ముఖ్యంగా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల బిజినెస్ చేస్తున్న మూవీస్ బోలెడున్నాయి.

రాజమౌళి, ప్రభాస్ సినిమాలే ఎక్కువగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి. ఇక చిరంజీవి సైరా, ఆచార్య.. బన్నీ పుష్ప కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

100 కోట్ల ట్రెండ్ మొదలయ్యాక.. పూర్తిగా 10 సినిమాలు కూడా ఆ రేంజ్ బిజినెస్ చేయలేదు తెలుగు రాష్ట్రాల్లో..!

అలాంటిది కేవలం 2024లోనే 10 సినిమాల వరకు 100 నుంచి 150 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయి కొన్ని సినిమాలు.

అందులో  ప్రభాస్ ప్రాజెక్ట్ కే.. పవన్ కళ్యాణ్ ఓజి, ఉస్తాద్.. అల్లు అర్జున్ పుష్ప 2.. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. ఎన్టీఆర్ దేవర.. మహేష్ బాబు గుంటూరు కారం ఉన్నాయి. ఇవన్నీ 2024లోనే రానున్నాయి.

ఈ సినిమాలన్నింటి బిజినెస్ రేంజ్ 2000 కోట్ల వరకు ఉంటుంది. ఇవన్నీ కానీ అంచనాలు సరిగ్గా అందుకున్నాయంటే.. కోల్పోయిన నెంబర్ వన్ ప్లేస్ పరిగెత్తుకుంటూ మళ్లీ టాలీవుడ్ చెంతకు వచ్చేస్తుంది.

అందులో చాలావరకు పాన్ ఇండియన్ సినిమాలే ఉన్నాయి. అవి హిట్టైతే.. నెంబర్ 1 మాత్రమే కాదు.. టాలీవుడ్ మార్కెట్‌ కూడా ఒకేసారి రెండింతలు పెరగనుంది.