పూజ హెగ్డే కైవసం చేసుకున్న అవార్డులు..

20 September 2023

2017లో జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ ద్వారా దువ్వాడ జగన్నాధం సినిమాకి  ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ (ఫిమేల్) అవార్డు పొందింది పూజా హెగ్డే.

2017లోనే మళ్ళి జీ తెలుగు గోల్డెన్ అవార్డ్స్ చే దువ్వాడ జగన్నాధం చిత్రానికిగాను ఫేవరెట్ హీరోయిన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచింది.

తరువాత 2019లో జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో అరవింద సమేత వీర రాఘవలో నటనకి అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా అవార్డు కైవసం చేసుకున్నారు.

తర్వాత 2020లో జీ సినీ అవార్డ్స్ తెలుగు ద్వారా మహర్షి సినిమాకి అభిమాన నటి అవార్డు అందుకుంది బుట్టబొమ్మ.

2021లో జరిగిన 9వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో అల వైకుంఠపురములో ఆమె నటనకి ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది.

2021లో 7వ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో అల వైకుంఠపురములో చిత్రానికి గానూ అత్యంత ప్రజాదరణ పొందిన నటిగా అవార్డు పొందింది పూజా.

గతఏడాది జరిగిన 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  చిత్రానికి  ఉత్తమ నటి  – తెలుగు అవార్డు గెలుచుకుంది.

అదే 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) ద్వారానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో తన నటనకి ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డ్ – తెలుగు కైవసం చేసుకుంది.

అదే 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA)లో యూత్ ఐకాన్ (ఫిమేల్) అవార్డు గెలిచింది టాలీవుడ్ బుట్టబొమ్మ.

ఈ ఏడాది జరిగిన పింక్‌విల్లా స్టైల్ ఐకాన్స్ అవార్డ్స్ ప్రదానంలో స్టైలిష్ గేమ్ ఛేంజర్ - ఫిమేల్ అవార్డును సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.