పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..

23 October 2023

మన అందరి డార్లింగ్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి.

ఇది బాలీవుడ్ అరంగేట్రం అవుతుందో లేదో మాకు తెలియదు, కానీ ప్రభాస్ యాక్షన్ జాక్సన్‌ సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు.

బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొదటి దక్షిణ భారత స్టార్ ప్రభాస్.

తాను నటుడిని కావాలని ఎప్పుడూ అనుకోలేదని,హోటల్ వ్యాపారిని కావాలనుకున్నానని రెబెల్ స్టార్ ప్రభాస్ గతంలో తెలిపారు.

ప్రభాస్‌కు ఎంతో ఇష్టమైన వంటకం చికెన్ బిర్యానీ. ప్రభాస్ తన వ్యాయామ విధానంలో భాగంగా తరుచూ వాలీబాల్ ఆడుతారు.

ప్రభాస్ దాదాపు 20 సార్లు మున్నా భాయ్ MBBS, 3 ఇడియట్స్ చూశారు. అతను బాలీవుడ్ డైరెక్టర్ రాజు హిరానీకి పెద్ద అభిమాని.

అతను దాదాపు ఐదు సంవత్సరాల పాటు బాహుబలి రెండు భాగాల చిత్రానికి మాత్రమే పనిచేశాడు. ఆ కాలంలో వేరే ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు.

ప్రభాస్ అమెరికన్ హాలీవుడ్ లెజెండరీ ఆక్టర్ రాబర్ట్ డి నీరోకి వీరాభిమాని అని ఓ పాత ఇంటర్వ్యూలో తెలిపారు.