17 August 2025

నెట్టింట అందాల ఆరబోత.. అయినా బ్యూటీకి కలిసిరాని అదృష్టం.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. 

అందులో ఫరియా అబ్దుల్లా ఒకరు. హైదరాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ 2021లో జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 

ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్టు అందుకుంది. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, యూట్యూబర్, థియేటర్ ఆర్టిస్టుగా పలు వీడియోస్ చేసింది. 

అలాగే జాతిరత్నాలు సినిమా కంటే ముందు ఓ వెబ్ సిరీస్ సైతం చేసింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో మెరిసింది. అలాగే బంగార్రాజు చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. 

లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు వంటి సినిమాల్లో నటించి తెలుగు జనాలకు మరింత దగ్గరయ్యింది ఈ భామ.

అయితే వరుస హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ ఫరియాకు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇటీవలే మత్తు వదలరా 2 చిత్రంలోనూ కనిపించింది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను కట్టిపడేస్తుంది. కానీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం ఈ బ్యూటీకి రావడం లేదు.