జాబిలమ్మకి చీర కట్టునట్టు మెరిసిపోతున్న ఫరియా.. 

TV9 Telugu

18 July 2024

28 మే 1998న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఫరియా అబ్దుల్లా.

ఈ బ్యూటీ హిందీ-ఉర్దూ మాట్లాడే కుటుంబం. అయితే సినిమాలపై ఉన్న ఇష్టంతో తన కెరీర్ కోసం తెలుగు నేర్చుకుంది.

ఈ వయ్యారి సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్ లో థియేటర్ నటిగా పనిచేసింది. తర్వాత హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది.

2021లో తెలుగు కామెడీ డ్రామా చిత్రం జాతి రత్నాలుతో సినిమాతో కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ భామ.

2022లో సంతోష్ శోభన్ సరసన లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్ అనే సినిమాలో కథానాయకిగా మెప్పించింది ఈ వయ్యారి భామ.

2023లో రవితేజ హీరోగా నటించిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం రావణాసురలో పాత్రలో నటించింది ఈ బ్యూటీ.

అదే సంవత్సరం , ది జెంగాబురు కర్స్‌ అనే హిందీ వెబ్ సిరీస్ తో మొదటిసారి డిజిటల్ లో కనిపించింది, ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది.

ఇటీవల అల్లరి నరేష్ సరసన ఆ ఒక్కటి అడక్కు అనే టాలీవుడ్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.