ఈ అమ్మడి అందానికి ఆ పువ్వులు కూడా వావ్ అనాల్సిందే..

20 December 2023

TV9 Telugu

28 మే 1998 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో జన్మించింది అందాల తార ఫారియా అబ్దుల్లా.

హిందీ, ఉర్దూ మాట్లాడే కుటుంబంలో పుట్టినప్పటికీ సినిమాలపై ఉన్న ఇష్టంతో తెలుగు నేర్చుకుంది ఈ వయ్యారి భామ.

హైదరాబాద్ లోని ఆత్మకూరిలో భావన్స్ స్కూల్, బంజారా హిల్స్ లో మెరిడియన్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తిచేసింది.

హైదరాబాద్ లోని లయోలా అకాడమీ డిగ్రీ పీజీ కళాశాల నుంచి మల్టీమీడియా మరియు మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందింది.

2021లో నవీన్ పోలిశెట్టికి జోడిగా జాతిరత్నాలు అనే తెలుగు కామెడీ డ్రామా చిత్రంతో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది.

తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో అదితి పాత్ర చేసింది. 2022లో బంగార్రాజు చిత్రంలో స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకుంది.

2023లో రవితేజ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ రావణాసురలో లాయర్ కానక మహాలక్ష్మిగా మెప్పించింది.

ప్రస్తుతం అల్లరి నరేష్ కి జోడిగా ఓ చిత్రంలో కథానాయకిగా నటిస్తుంది. దీంతోపాటు వల్లి మయిల్ చిత్రంతో తమిళంలో పరిచయం కానుంది.