స్టన్నింగ్ లుక్స్ లో కుర్రాళ్లను తనవైపు తిప్పుకున్న ఫరియా..
08 October 2023
28 మే 1998న కువైట్‌లో జన్మించింది పాతికేళ్ల చిన్నది ఫరియా అబ్దుల్లా. కానీ ఆమె సొంత ఊరు మాత్రం హైదరాబాద్.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మెరిడియన్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది వయ్యారి భామ ఫరియా.
తర్వాత హైదరాబాద్‌లోని లయోలా అకాడమీ డిగ్రీ PG కళాశాలలో మల్టీమీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌ను అభ్యసించింది.
ఫరియా అబ్దుల్లా తండ్రి M. J. అబ్దుల్లా ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఆమె తల్లి కౌసర్ సుల్తానా థెరపిస్ట్ గా చేస్తుంది.
2021లో నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది అందాల తార ఫరియా. ఈ చిత్రంలో చిట్టి పాత్రలో కుర్రాళ్ల మనసు దోచేసింది.
తర్వాత అఖిల్ పూజ హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో ఓ చిన్న పాత్రలో ఆకట్టుకుంది ఈ వయ్యారి.
2022లో నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ చిత్రం బంగార్రాజు మూవీ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది ఈ తెలంగాణ పోరి.
చివరిగా 2022లో సంతోష్ శోభన్ కి జోడిగా లైక్ షేర్ సబ్స్క్రయిబ్ అనే మూవీలో కథానాయకిగా నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి