హిట్ వచ్చిన ఈ ముద్దుగుమ్మను ఎవరూ పట్టించుకోవడంలేదే..

Rajeev 

02 February 2025

Credit: Instagram

చాలా మంది హీరోయిన్స్‌కు అందం అభినయం ఉన్నా.. అదృష్టం లేక రాణించలేకపోతోన్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు.

వారిలో ఫరియా అబ్దుల్లా ఒకరు. హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా.. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమాతో పరిచయం అయ్యింది.

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.

అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఆతర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు చేసింది.

కానీ ఈ సినిమాలు ఫరియా అబ్దుల్లా సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ఇక రీసెంట్ గా మత్తు వదలరా 2 సినిమాలో నటించింది.

ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఫరియాకు అనుకున్నంతగా ఛాన్స్ లు రావడం లేదు. అందాలతో కవ్వించినా.. లాభం లేకుండా పోతుంది.