భల్లాలదేవాకి ఫ్యాన్స్ బర్త్ డే విషెస్..
14 December 2023
ఈ రోజు (గురువారం) దగ్గుబాటి వారసుడు రానా పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు.
బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత నేనే రాజు మంత్రి, అరణ్య, విరాట్ పర్వం వంటి చిత్రల్లో నటించారు రానా దగ్గుబాటి.
అయితే ఈ మధ్య సినిమాల విషయంలో కాస్త నెమ్మదించారు భల్లాలదేవ. ఇటీవల హిరణ్యకశ్యప్ అనౌన్స్ చేసిన ఇంకా మొదలుకాలేదు.
మొదట్లో అంటే గుర్తింపు కోసం వరుస సినిమాలు చేశానని.. ఇప్పుడు తనకు ఆ అవసరం లేదంటున్నారీయన రానా దగ్గుబాటి.
అందుకే ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే తేజ, గుణశేఖర్ లాంటి సినిమాలతో సినిమాలు చేయబోతున్నారు రానా.
T. J. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో రానా నటించనున్నారు.
ప్రభాస్ ప్రాజెక్ట్ కేలోను ఓ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. గతంలో కామిక్ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కల్కి టీంతో సందడి చేశారు రానా.
ఇదిలా ఉంటె ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న టాలీవుడ్ భల్లాలదేవా రానా దగ్గుబాటికి జన్మదిన శుభాకాంక్షలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి