ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. సాయి పల్లవి స్పీడ్ తగ్గించిందా.? 

Rajeev 

28 AUG 2024

నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి టాలీవుడ్ లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ ఆమెను లేడీ పవర్ స్టార్ అంటారు. 

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బాగానే క్రేజ్ తెచ్చుకుని. చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులర్ అయ్యింది. 

ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. నేచురల్ నటనతో పాటు సహజమైన అందంతో ఆకట్టుకుంది. 

ఈ అమ్మడు చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలాగే ఎక్కడా గ్లామర్ జోలికి వెళ్ళాదు ఈ చిన్నది. 

నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తున్న సాయి పల్లవి.. ఇటీవలకొంత గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు తిరిగి బిజీ అవుతోంది. 

విరాటపర్వం సినిమా తర్వాత ఈ చిన్నది కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు తండేల్ అనే సినిమా చేస్తోంది. ఈసినిమా తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు సాయి పల్లవి.