ఆ హీరోయిన్ ను ఫాలో అవ్వని శ్రీలీల.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

Rajeev 

15 March 2024

కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు వచ్చిన ముద్దుగుమ్మ శ్రీలీల ఇక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది.

రవితేజ హీరోగా నటించిన ధమకా సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. దాంతో శ్రీలీలకు భారీ ఆఫర్స్ వచ్చాయి.

యంగ్ హీరోలందరూ ఈ అమ్మడినే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఈ చిన్నది చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.

ధమాకా సినిమా తర్వాత వరుసగా సినిమాలు బోల్తా కొట్టాయి. మధ్యలో బాలయ్య భగవంత్ కేసరి సినిమా హిట్ అయ్యింది.

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటికీ ఈ చిన్నదాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ చిన్నదాని చేతిలో క్రేజీ ఆఫర్స్ ఉన్నాయి. అయితే తాజాగా శ్రీలీల పై కొంతమంది గుర్రుగా ఉన్నారు.

వాళ్లు ఎవరో కాదు రష్మిక ఫ్యాన్స్. దానికి కారణం లేకపోలేదు. రష్మిక, శ్రీలీల ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీ నుంచే వచ్చారు.

అయితే శ్రీలీల చాలా మందిని ఫాలో అవుతుంది. వారిలో సెలబ్రెటీలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఆ లిస్ట్ లో రష్మిక లేదు.

ఇందులో ఏముంది అనుకుంటున్నారా..? అయితే కన్నడ చాలా మంది హీరోయిన్స్ ను ఫాలో అవుతున్న శ్రీలీల. స్టార్ హీరోయిన్ రష్మికాను ఫాలో అవ్వడం లేదు.