28 September 2023
అందుకే పార్టీ అనౌన్స్ చేసి మరీ తర్వాత సారీ చెప్పారు సూపర్ స్టార్. దాంతో ఈయన పాలిటిక్స్‌కు పూర్తిగా దూరమైనట్లే అని అంతా ఫిక్సైపోయారు. కానీ అదంత ఈజీ కాదని రజినీకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.
రజినీ రాజకీయాలకు ఎంత దూరంగా ఉన్నా.. ఆయన్ని రమ్మని ఆహ్వానాలు మాత్రం ఆగట్లేదు. ఆ మధ్య గవర్నర్ పోస్ట్ ఇస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఓ పార్టీకి ఆయన సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటి నుంచి దూరంగా ఉండటానికే.. సినిమాలను మార్గంగా ఎంచుకుంటున్నారు రజినీ. అందుకే వరస సినిమాలు సైన్ చేస్తున్నారు.
నిజానికి తన అనారోగ్యం కారణంగా ఇకపై సినిమాలు తక్కువ చేయాలని నిర్ణయించుకున్నారు రజినీ. దానికితోడు కొన్నేళ్లుగా సరైన బ్లాక్‌బస్టర్ కూడా రాలేదు.
కానీ మొన్నొచ్చిన జైలర్ ఏకంగా 800 కోట్ల వరకు వసూలు చేయడంతో రజినీ బ్యాక్ ఆన్ ట్రాక్ అయ్యారు. దాంతో వరస సినిమాలు ఒప్పుకుంటున్నారీయన. ప్రస్తుతం జ్ఞానవేల్‌తో సినిమా చేస్తున్నారు రజినీకాంత్.