వారెవా.. సూపర్‌ స్వీటీ!

TV9 Telugu

13 March 2024

యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా... సోషల్‌ మీడియా మొత్తం ప్రస్తుతం మన థంబ్‌నైల్‌లో చెప్పుకున్న స్టేట్‌మెంటే నడుస్తోంది.

యస్‌... అందరూ ముక్తకంఠంతో వారెవా... సూపర్‌ స్వీటీ అంటూ హీరోయిన్ అనుష్క శెట్టిని తెగ పొగిడేస్తున్నారు.

ఉన్నట్టుండి అనుష్క శెట్టిని అంతగా పొగడాల్సిన అవసరం ఏంటి అంటారా? ఆమె అప్పియరెన్స్ అలా అనేలా చేస్తోంది మరి.

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న కథనర్‌ మలయాళ సినిమా షూటింగ్‌ మొదలైంది.

ఇందులో భాగంగా మలయాళీ సినిమా కథనర్‌ యూనిట్‌తో కలిసి ఫొటోలు తీసుకున్నారు స్టార్ కథానాయక అనుష్క శెట్టి.

ఈ పిక్స్ లో ఆమె నాజూగ్గా కనిపిస్తున్నారు ఈ వయ్యారి. సైజ్‌ జీరో సమయంలో విపరీతంగా బరువు పెరిగారు స్వీటీ.

తగ్గడానికి ఆమె చాలా రకాలుగా ప్రయత్నించారు. రీసెంట్‌గా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలోనూ కాసింత భారీగానే కనిపించారు.

అయితే ఇప్పుడు మలయాళీ చిత్రం కథనర్‌ యూనిట్‌తో తీసుకున్న పిక్స్ లో మాత్రం చాలా నాజూగ్గా కనిపిస్తున్నారు జేజమ్మ.