నాని ఇది నీకు న్యాయమా.. విజయ్ దేవరకొండ పరువు పోయింది కదా
తెలిసి జరిగిన తెలియక జరిగిన నాని హాయ్ నాన్న ఈవెంట్ కారణంగా ... ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ పరువు పోయింది.
శౌర్యు డైరెక్షన్లో నాని హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్ హాయ్ నాన్న. డిసెంబర్ 7న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా విశాఖలో జరిగింది.
అయితే ఈవెంట్ బిగినింగ్‌లోనే ఓ అనుకోని సంఘటన జరిగి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.
హాయ్ నాన్న ఈవెంట్లో రష్మిక విజయ్ మాల్దీవుల్లోని స్విమింగ్ పూల్లో ఉన్న ఫోటో డిస్‌ప్లే అయింది. అందరూ షాక్ అయ్యేలా చేసింది.
ఇక వీరి ఫోటోలు ఇలా ఈవెంట్లో కనిపించడంతో నానితో పాటు.. హీరోయిన్ మృణాల్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇదేంటి అన్నట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు.
ఇక వీరికి తోడు విజయ్ , రష్మిక ప్యాన్స్ కూడా ఈ ఇన్స్‌డెంట్ పై సీరియస్ అవుతున్నారు. హాయ్ నాన్న హీరో నానిని విమర్శిస్తున్నారు.
ఇదంతా చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ అంటూ.. ఆరోపిస్తున్నారు. ఇదేమన్నా న్యాయమా నాని అంటూ కామెంట్స్ చేస్తున్నారు.