ANIL KUMAR POKA

ఫ్యామిలీతో 'ఫ్యామిలీ స్టార్'.. కలిసి చూసెయ్యండి ఓటీటీలో..

25 April 2024

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది.

పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఈ సినిమా హిట్ సరిపోలేదు.

ఏప్రిల్ 5 న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటె కొంతమంది ఆడియన్స్ మాత్రం ఫ్యామిలీ స్టార్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌‌లో ఏప్రిల్ 26 (ఫ్రైడే) నుంచి ఫ్యామిలీ స్టార్ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

మృణాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

కేవలం 20 రోజులకే ఫ్యామిలీ స్టార్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మధ్య విజయ్ కాస్త వెనకపడ్డాడు అని నెటిజన్స్ టాక్.