TV9 Telugu

ఫ్యామిలీ స్టార్ టీజర్.. శశివదనే నుంచి మరో పాట..

04 March 2024

విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయక.

ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఎప్రిల్ 5న ఈ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదల కానుంది.

తాజాగా ఈ చిత్ర టీజర్‌పై అప్‌డేట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. త్వరలోనే టీజర్ వచ్చేస్తుందని ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.

ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది.

ఈ వేడుక కోసం భారీగా ఖర్చు పెడుతుంది అంబాని ఫ్యామిలీ. ఈ వేడుక కోసం ఇప్పటికే చాలా మంది ప్రముఖులు జామ్ నగర్ చేరుకున్నారు.

బాలీవుడ్ నుంచి మాత్రమే కాదు.. హాలీవుడ్ నుంచి కూడా ప్రీ వెడ్డింగ్‌కి హాజరు కానున్నారు. టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు హాజరయ్యారు.

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంట‌గా నటించిన చిత్రం ‘శశివదనే’. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 1న ‘ఏమిటో ఏమిటో..’ అనే పాటను విడుదల చేశారు.