సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న చిన్నది.. మతిపోగొడుతున్న మెహ్రీన్ 

Rajeev 

10 February 2025

Credit: Instagram

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా. ఈ సినిమాలో బబ్లీ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది.

నాని సినిమాలో అమాయకపు యువతిగా కనిపించి అలరించింది. ఆతర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. 

టాలీవుడ్ యంగ్ హీరోల సరసన అవకాశాలు అందుకుంది ఈ భామ. వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు.

దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి అందాలతో ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం  మెహ్రీన్ పిర్జాదా కొత్త సినిమాలను అనౌన్స్ చేయలేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం  గడుపుతుంది. 

సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే పిక్స్ ప్రేక్షకులను కవ్విస్తున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.