జబర్ధస్త్ షో గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది.
ఈటీవీలో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి అందరిని ఎంతగానో నవ్వించింది.
జబర్ధస్త్ షో 2013లో ప్రారంభం అయింది. అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకే చేరింది.
ఆ తర్వాత రెండో రోజు షో ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ పేరుతో ప్రసారం అయింది. అయితే ఇప్పుడు జబర్ధస్త్ షో ఆగిపోబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది దీనిలో నిజం ఎంతుంది అంటే ??
జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ప్రారంభం అయిన తర్వాత లాక్‌డౌన్ సమయంలో తప్పితే ఎప్పుడూ ఆగిపోలేదు. ఇప్పుడు ఈ వారం నుంచే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోను ఆపేస్తున్నట్లు తెలిపారు.
ఇకపై గురు, శుక్రవారాల్లో జబర్ధస్త్ మాత్రమే ప్రసారం అవుతున్నట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చెప్పారు. ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోను ఆపేస్తున్నట్లు ఆటో రాంప్రసాద్ తన స్కిట్ ద్వారా తెలిపాడు.
అనంతరం యాంకర్ రష్మీ 'ఎక్స్‌స్ట్రా' పదం మిస్ అవుతుంది. కానీ రెండు ఎపిసోడ్స్ వస్తాయి' అని చెప్పింది. మొత్తానికి ఈ షో రెండు రోజులు వచ్చినా 'ఎక్స్‌స్ట్రా' అనేది మాత్రం ఉండదని చెప్పారు.