ఆఫ్టర్‌ జవాన్‌.. అట్లీ నెక్స్ట్ మూవీపై అందరిలో ఆసక్తి,..

10 September 2023

జవాన్‌ సినిమాకు నార్త్, సౌత్‌ అనే తేడా లేకుండా అన్ని వైపుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. అన్నీ బాగానే ఉన్నాయి.

కానీ ఆ ఒక్క కొరతా ఉండిపోయింది అని అంటున్నారు దళపతి ఫ్యాన్స్. అట్లీ మీద చిరు కోపం ఉన్నప్పటికీ, జవాన్‌ సినిమాను మాత్రం సూపర్బ్ గా ఆదరిస్తున్నారు.

దళపతి విషయంలో మీరేం దిగులుపడకండి. జవాన్‌ సినిమాలో దళపతి ఉంటే నేను ముందే హింట్‌ ఇచ్చేవాడిని. ఆయన లేడు కాబట్టే, నేను చెప్పలేదు.

విజయ్ దళపతితో నాకున్న అనుబంధం అందరికీ తెలుసు. విజయ్‌తో తప్పకుండా సినిమా చేస్తా అని అంటున్నారు అట్లీ.

అన్నీ కలిసొస్తే దళపతితో మాత్రమే కాదు, షారుఖ్‌, దళపతి ఇద్దరినీ కలిసి ఓ మల్టీస్టారర్‌ స్క్రిప్ట్ చేస్తానన్నది అట్లీ చెబుతున్న మాట.

ఈ సినిమా అతి త్వరలో పట్టాలెక్కితే బావుంటుందని అంటున్నారు దళపతి ఫ్యాన్స్. జవాన్‌తో అట్లీ వర్క్ కి ఫుల్‌ ఫిదా అయిపోయారు షారుఖ్‌.

అల్లు అర్జున్‌తోనూ అట్లీ సినిమా ఉందనే వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ విషయాన్ని అట్లీ కూడా యాక్సెప్ట్ చేశారు. బన్నీకి కథ చెప్పా. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి.

అవి కొలిక్కి వస్తే, త్వరలోనే మీకు మంచి విషయం చెబుతానని అల్లు ఆర్మీకి హింట్‌ ఇచ్చారు అట్లీ. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్‌.