సినిమాలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉండటం కాదు.. ఏడాదిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ట్రెండింగ్‌లో ఉండటం గొప్ప. ఆ విషయంలో సాయి పల్లవి తోపు అంతే.
బిల్డప్ కాస్త ఓవర్ అనిపించినా జరుగుతున్నదిదే. సినిమాలు చేసినా చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటున్నారీ భామ.
పైగా తన తెలివైన నిర్ణయాలతో ఫ్లాపుల నుంచి తప్పించుకుంటున్నారు. మరోవైపు హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ క్రేజ్ ఫిదా బ్యూటీకి సాధ్యమైంది.
విరాట పర్వం తర్వాత తెలుగులో సినిమా చేయలేదు ఈ భామ. కానీ క్రేజ్ పరంగా మాత్రం సాయి పల్లవి నెక్ట్స్ లెవల్ అంతే.
తర్వాతి సినిమా ఎప్పుడు మేడమ్ అంటే.. మంచి కథ రావాలి కదండీ.. అది లేకపోతే నేనెలా సినిమా చేస్తానటున్నారీమే.
ఆ కథ వచ్చేవరకు ఖాళీగా ఉంటాను కానీ కాసుల కోసం సినిమాలు చేయనంటున్నారు. అలా సాయి పల్లవి వదిలేసిన భోళా శంకర్, డియర్ కామ్రేడ్ రిజల్ట్స్ ఏంటో అందరికీ తెలుసు.
భోళా శంకర్‌లో కీర్తి సురేష్ పాత్ర కోస ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు. కానీ సున్నితంగా ఆ పాత్రను ఆమె తిరస్కరించారు.
అలాగే డియర్ కామ్రేడ్ సినిమాను కూడా ఈ భామ వదిలేసారు. ఇవే కాదు.. సాయి పల్లవి వదిలేసిన చాలా సినిమాలు రిలీజ్ తర్వాత ఫ్లాపయ్యాయి.
చంద్రముఖి కారెక్టర్ అంత ఈజీ కాదనే విషయం సాయి పల్లవికి తెలుసు. ఎలా నటించినా.. ట్రోలింగ్ తప్పదు. అందుకే ముందుగానే తెలివైన నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం శివ కార్తికేయన్ సినిమాతో పాటు తెలుగులో నాగ చైతన్య, చందూ మొండేటి సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తుంది.