ఇస్మార్ట్ శంకర్ సీన్ రిపీట్ చేసిన ఎలన్ మాస్క్.. ఒకే దారిలో వదిన, ఆడపడుచు..

TV9 Telugu

04 February  2024

రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కథనే నిజంగా చేసి చూపించింది అమెరికా స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్.

అందులో హీరో మెదడులో ఓ చిప్‌ను అమరుస్తారు. ఇప్పుడు నిజంగానే ఓ మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్‌ చిప్‌ను అమర్చి చరిత్ర సృష్టించింది న్యూరాలింక్ కంపెనీ.

తాజాగా ఈ చిప్‌ ద్వారా మెదడుకు, కంప్యూటర్‌కు నేరుగా అనుసంధానం చేసే దిశగా ఈ సంస్థ ప్రయత్నాలు చేసింది కూడా.

చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు మెగాస్టార్. దీనికోసం ప్రత్యేకంగా జిమ్ వర్కవుట్స్ కూడా చేసారు చిరు.

ఇదిలా ఉంటే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటించారు దర్శక నిర్మాతలు. 2025 జనవరి 10న విశ్వంభరను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.

మూడు ముళ్లు పడ్డాక, సినీ కెరీర్‌ పరంగా తన జీవితంలో ఎలాంటి మార్పులూ లేవని అన్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి.

వరుణ్‌తేజ్‌ సతీమణిగా మెగాఫ్యామిలీలోకి అడుగుపెట్టారు లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ తెలుగు సినిమా, ఓ తమిళ సినిమా ఉన్నాయి.

ఆమె ఆడపడుచు, నీహారిక కొణిదెల కూడా మెడ్రాస్‌కారన్‌ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. సో... వదినా, ఆడపడుచు ఇప్పుడు సేమ్‌ రూట్లో ట్రావెల్‌ చేస్తున్నారన్నమాట.