ఇద్దరు పిల్లలున్నారంటూ షాకిచ్చిన ఈషా రెబ్బా
టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తెలుగు హీరోయిన్స్‌లో ఈషా రెబ్బా ఒకరు.
అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది ఈషా.
తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఆఫర్లు అందుకుంది.
ఇటీవలే మాయా బజార్ ఫర్ సేల్ అనే సిరీస్‌లో యాక్ట్ చేసింది.
ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ షోలో పాల్గొన్న ఈషా..
తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది? అన్న ప్రశ్నకు తొందరపడ్డప్పుడు అని సమాధానమిచ్చింది.
ఆ తర్వాత యాంకర్.. నీ ప్రేమకథ గురించి చెప్పు అని అడగ్గా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వెల్లడించింది.
ఆమె మాటతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఈషా తనకు పిల్లలున్నారని చెప్పడంతో ప్రోమో పూర్తయింది.
దీంతో అసలు నిజమేంటనేది తెలియరాలేదు.
తను ఎవరినైనా దత్తత తీసుకుందా? లేదా తన బంధువుల సంతానాన్ని తన పిల్లలుగా పెంచుకుంటుందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి