అందంగా లేనని హేళన చేశారు: ఈషా రెబ్బా

Phani.ch

16 May 2024

ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ ముద్దుగుమ్మ పక్కా తెలుగు అమ్మాయి.. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "నేను ఇక్కడ మొదటి సినిమా కోసం ఆడిషన్స్ కి వెళుతుంటే, తెలుగు అమ్మాయివని చెప్పకు .. నార్త్ నుంచి వచ్చినట్టుగా చెప్పు అని నా ఫ్రెండ్స్ చెప్పారు. 

కానీ అలా చెప్పడం నాకు ఇష్టం లేదని చెప్పింది ఈషా రెబ్బా. అందుకే నేను తెలుగు అమ్మయిననే చెప్పాను" అని అన్నారు. 

ఇండస్ట్రీలో  తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ రావడం కష్టమే. కెమెరా ముందుకు వెళ్లగానే తెలుగు అమ్మాయినని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్లంతా మొహాలు మాడ్చేస్తారు.

అదే మలయాళ సినిమాల్లో అయితే, తమ భాష వచ్చినవారికే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. భాషరాని వారిని పెట్టుకుని, వాళ్లు సమయాన్ని వృథా చేసుకోరు.

నేను తెలుగులో ఒక సినిమా చేసేలోగా ఒక మలయాళ హీరో 6 సినిమాలు చేశాడు" అని తెలిపింది ముద్దుగుమ్మ ఈషా రెబ్బా.

కెరియర్ ఆరంభంలో నల్లగా ఉన్నాననే అవమానాలు కూడా నాకు ఎదురయ్యాయి. ఆడిషన్స్ కి వెళితే, ఎంతనల్లగా ఉన్నారో చూడండి అని నాకు చూపించేవారు.

దాంతో అవకాశాల కోసం ఎవరినైనా కలవాలంటే నాకు భయం వేసేది. కానీ నాలో కొంచెం మొండితనం కూడా ఉంది. అందువలన ముందుకు వెళ్లగలిగాను తెలిపింది.