చీరకట్టులో అట్రాక్ట్ చేస్తున్న ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోస్ 

Phani.ch

02 June 2024

ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ ముద్దుగుమ్మ మన తెలుగింటి పిల్ల. ఈషా రెబ్బా క్రేజ్ సోషల్ మీడియాలో  మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఈషా రెబ్బాకు అందం, అభినయం ఉన్న మంచి అవకాశాలు అయితే దక్కడంలేదు..  టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ కోసం అనేక ప్రయత్నాలన్నీ చేస్తోంది.

ఈషా రెబ్బ ఒకవైపు సినిమాలు చేస్తూనే .. మరోవైపు వెబ్ సిరీస్ లలో ఇరగదీస్తోంది. ఈషా ఇప్పటకే ‘పిట్ట కథలు’ ‘తీ రోజెస్’ వంటి పలు వెబ్ సిరీస్ లో నటించింది.

ఈషా రెబ్బ తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో నటిస్తూ హల్ చల్ చేస్తోంది.  అందుకే ఎప్పటి కపుడు తన ఫోటో షూట్ లతో హల్ చల్ చేస్తోంది.

తెలుగులో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో పరిచయమైన ఈషా రెబ్బ.. ఇంద్రగంటి మోహనక‌ృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తర్వాత‘ సినిమాలో నటించింది.

అటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ‘లో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించినా ఈషా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి.

అయితే తాజాగా చీరకట్టులో ఫోటోస్ షేర్ చేసి అందరిని అట్రాక్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.