ఆ దివిలో మేఘం మురిసి వర్షిస్తుందేమో ఈమెను చూసి..

05 October 2023

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది అందాల భామ ఈషా రెబ్బ. ఈ చిత్రంలో హరిణి పాత్రలో మెప్పించింది.

తర్వాత మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో తొలిసారి కథానాయకిగా నటించింది.

2015లో మరోసారి మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన బందిపోటు సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా ఆకట్టుకుంది.

2016లో ఓయ్ అనే చిత్రంతో కథానాయకిగా తమిళ అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫ్రాన్సిస్ మార్కస్ ఈ చిత్రానికి దర్శకుడు.

తర్వాత అమీతుమీ, మాయ మాల్, దర్శకుడు, ఆ, బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ తెలంగాణ పోరి.

హీరోయిన్ గా ఎన్ని చిత్రాల్లో నటించినా.. అంతగా కలిసి రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ బాట పట్టింది వయ్యారి భామ ఈషా రెబ్బ.

2018లో ఎన్టీఆర్ అరవింద సామెత వీర రాఘవ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే చెల్లి పాత్రలో మెప్పించింది ఈ బ్యూటీ.

సినిమాలు మాత్రమే కాదు 3 రోజెస్, పిట్టకథలు, మాయ బజార్ ఫర్ సేల్, దయ అనే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది ఈషా.