అందానికి ఈమె అంటే ప్రాణం అనుకుంట.. వదిలిపోనంటుంది..

18 October 2023

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో హరిణి అనే ఓ పాత్రలో తొలిసారి వెండితెరపై కనిపించింది వయ్యారి భామ ఈషా రెబ్బ.

2013లో వచ్చిన సుమంత్ అశ్విన్ అంతకుముందు ఆ తర్వాత చిత్రంలో కథానాయకిగా తెలుగు తెరఫై సందడి చేసింది ఈ భామ.

తర్వాత అల్లరి నరేష్ హీరోగా చేసిన కామెడీ ఎంటర్టైనర్ బందిపోటు అని చిత్రంలో కథానాయకిగా తననటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

2016లో ఓయ్ అనే ఓ తమిళ సినిమాతో కోలీవుడ్ కు పరిచయం అయింది ఈ అందాల భామ.ఈ మూవీలో తన అందంతో ఆకట్టుకుంది.

2017లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అమీ తుమీ సినిమాలో అడవి శేష్ కి జోడిగా ఆకట్టుకుంది ఈ వయ్యారి.

తర్వాత మాయ మాల్, దర్శకుడు, బ్రాండ్ బాబు వంటి కొన్ని చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు.

2018లో ఎన్టీఆర్ అరవింద సామెత వీర రాఘవ మూవీలో పూజా హెగ్డే చెల్లెలిగా ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల తార.

సినిమాల్లో మాత్రమే కాదు 3 రోజెస్, పిట్టకథలు, మాయాబాజార్ ఫర్ సేల్, దయ వంటి ఓటీటీ వెబ్ సిరీస్ లో కూడా నటించింది ఈ భామ.