ఆ మన్మధుడే బ్రహ్మగా మారి ఈ వయ్యారిని మలిచాడేమో..

19 November 2023

19 ఏప్రిల్ 1990న తెలంగాణలోని కాకతీయ్య సామ్రాజ్య రాజధాని వరంగల్ లో జన్మించింది వయ్యారి భామ ఈషా రెబ్బ.

ఈ బ్యూటీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నపుడు మోడల్‌గా పనిచేసింది. ఆ తర్వాత దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుండి ఆడిషన్ కాల్ వచ్చింది.

2012లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో తొలిసారి నటించింది.

2013లో అంతక ముందు ఆ తర్వత చిత్రంలో సుమంత్ అశ్విన్ పక్కన కథానాయకిగా ప్రేక్షకులను అలరించింది ఈ వయ్యారి.

2015లో అల్లరి నరేష్ కి జోడిగా బందిపోటు అనే ఓ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంలో కథానాయకిగా నటించింది ఈ బ్యూటీ.

2016లో ఓయ్ అనే ఓ తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కోలీవుడ్ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ.

2017లో అమీ తుమీ అనే కామెడీ ఎంటర్టైనర్ లో ప్రధాన పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో నటనకు మూడు అవార్డ్స్ అందుకుంది.

2021లో త్రి రోజెస్, పిట్టకథలు; 2023లో మాయాబజార్ ఫర్ సేల్, దయ ఆమె ఓటీటీ వెబ్ సిరీస్ లో నటించింది ఈ చిన్నది.