పీరియడ్ వచ్చిన మేము షూటింగ్ చేస్తాం.. : ఈషా రెబ్బా

Rajeev 

24 May 2024

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ గతకొంతకాలంగా సైలెంట్ గా ఉంది. ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. 

సైడ్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది ఈషా రెబ్బ. అంతకు ముందు ఆతర్వాత తో హీరోయిన్ అయ్యింది. 

ఆతర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసింది ఈషా రెబ్బా. కానీ హీరోయిన్ గా సక్సెస్ కాలేదు ఈ అమ్మడు

ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. అరవింద సమెత సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.

తాజా ఇంటర్వ్యూలో ఈ పీరియడ్స్ గురించి ఇషా రెబ్బా మాట్లాడుతూ.. ‘‘షూటింగ్ టైంలో పీరియడ్స్ వస్తే..  లీవ్ పెట్టి వెళ్లిపోవడానికి ఉండదు అని తెలిపింది.

షూటింగ్ అంటే చాలా మంది ఆర్టిస్ట్ లు, బోలెడంత డబ్బు పెట్టి చేస్తారు. కాబట్టి పీరియడ్స్ టైంలో షూటింగ్‌లో పాల్గొనాల్సింది. 

ఒకొక్కసారి ఎక్కువగా నొప్పి వస్తే పెయిన్ కిల్లర్స్ వేసుకొని షూట్ చేస్తాం అని చెప్పుకొచ్చింది.

చాలామంది డైరెక్టర్లకి పీరియడ్స్ అని చెప్తే.. అర్ధం చేసుకుంటారు. కాస్త కోలుకోవడానికి టైం ఇస్తారు అని చెప్పుకొచ్చింది.