ఈషా చేసిన వెబ్‌సిరీస్, అందుకున్న అవార్డులు ఇవే..
05 September 2024
Battula Prudvi
2021లో 3 రోజెస్ అనే ఓ వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది ఈషా రెబ్బ. ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.
అదే ఏడాది పిట్టా కథలు అనే ఓ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. దీనిలో నాలుగు సెగ్మెంట్స్ కి నలుగురు దర్శకులు పని చేసారు.
ఈ ఏడాది కామెడీ డ్రామా వెబ్ సిరీస్ మాయ బజార్ ఫర్ సేల్ లో వల్లి శాస్త్రి అనే ఓ పాత్రలో నటించింది ఈ బ్యూటీ.
ఈ ఏడాది మరో వెబ్ సిరీస్ లో నటించింది. అదే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ దయ. ఇందులో అలివేలు అనే పాత్రలో ఆకట్టుకుంది.
వెబ్ సిరీస్ తో పాటు చాల చిత్రాల్లో నటించింది. అయితే సినిమాల్లో ఆమె నటనకు మూడు అవార్డ్స్ కూడా అందుకుంది ఈ భామ.
2017లో సినీగోయర్స్ అవార్డ్ వారిచే అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో ఈమె నటనకి బెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ అవార్డు అందుకుంది.
2018లో 16వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో అమీ తుమీ చిత్రానికి ఉత్తమ నటిగా స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకుంది.
అదే ఏడాది జీ తెలుగు అప్సర అవార్డ్స్ ద్వారా తెలుగు అమ్మాయి అవార్డు కైవసం చేసుకుంది అందాల తార ఈషా రెబ్బ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి