ఈ నగరానికి ఏమైంది రీ రీలీజ్ రికార్డు..

యువతను విపరీతంగా ఆకట్టుకున్న చిత్రాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి.

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది.

అయితే ఈ చిత్రం విడుదల సమయంలో భారీ విజయం అందుకోలేదు. మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది.

కానీ టీవీలో ఓటీటీలో మాత్రం ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

కాగా  తాజాగా రీ రీలీజ్ అయినా ఈ చిత్రం రికార్డ్ క్రియెట్ చేసింది.

యువత ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం రీ రిలీజ్ అవవడంతో భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రం తొలి రోజే  రూ.కోటికి పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

బడా చిత్రల జాబితాలో ఈ నగరానికి ఏమైంది చిత్రం కూడా చోటు దక్కించుకుంది.

ఈ చిత్రంతో విశ్వక్ సేన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.