08 September 2025

అమ్మాయిల డ్రీమ్ బాయ్.. వరుస హిట్టులతో ఫుల్ జోరు మీదున్న హీరో..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇప్పుడు అతడు దక్షిణాది క్రేజీ ఫాలోయింగ్ ఉన్న హీరో. 

అతడు మరెవరో కాదండి.. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. సీనియర్ హీరో మమ్ముట్టి తనయుడు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అతడు టాప్ హీరో. 

తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. విభిన్నమైన పాత్రలకు ప్రాణం పోశారు. 

 అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తక్కువ సమయంలోనే హీరోగా.. మమ్ముట్టికి తగిన వారసుడిగా పేరు సంపాదించుకున్నాడు. 

మహానటి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సీతారామం సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుని గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో హీరోగా తెలుగులో మరోసారి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. 

కేవలం నటుడిగానే కాకుండా గాయకుడిగా, నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన నిర్మించిన లోకా చాప్టర్ 1 చిత్రం హిట్ అయ్యింది.

కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. దుల్కర్ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.