TV9 Telugu
12 February 2024
మీ కోసం మళ్ళీ నేను.. అంటూ వచ్చేస్తున్న సీతారామం
వాలెంటైన్ వీక్ ప్రేమికుల కోసం ఇప్పుడు అందమైన ప్రేమకథలను మళ్లీ థియేట్రలలోకి తీసుకువస్తున్నారు.
ఇక ఇప్పుడు జనాల మనసులను తాకి.. కన్నీళ్లు తెప్పించిన లవ్ స్టోరీ సీతారామం మళ్లీ రాబోతుంది.
2022లో విడుదలైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇందులో మృణాల్, దుల్కర్ సల్మాన్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు.
ఈ వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14న మళ్లీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
“ఈ వాలెంటైన్స్ డే మీ అందరినీ సినిమా ప్రేమ కోసం, ప్రేమ కోసం తిరిగి వస్తున్నాం..
సీతారామం ఈ పిబ్రవరి 14న మళ్లీ విడుదలవుతుంది” అంటూ రాసుకొచ్చారు.
దీంతో మరోసారి సీతారామం విడుదలవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి