TV9 Telugu

తన ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీపై ఎక్కువ ఫోకస్ చేస్తున్న దుల్కర్.

16 March 2024

మలయాళం యంగ్ హీరో దుల్కర్ సల్మాన్‌కు సొంత ఇండస్ట్రీ పై ఇష్టం తగ్గిపోయిందా.? బయటికి రావాలని చూస్తున్నారా.?

ఇప్పుడు దుల్కర్ ను చూస్తుంటే అలానే ఉంది. ఆ ఇండస్ట్రీని వదిలేసి పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తున్నారు ఈ హీరో.

కెరీర్ మొదట్లో మలయాళంలోనే వరసగా నటించిన ఈ హీరో కొద్దిరోజులుగా తెలుగు ఇండస్ట్రీపై స్పెషల్ ఫోకస్ చేసారు.

మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రకు ప్రాణం పోసి సీతా రామం సినిమాలతో తెలుగు హీరో అయిపోయారు దుల్కర్..

సీతారామం సినిమాతో దుల్కర్ మార్కెట్ అమాంతం పెరిగిపోవడంతో ఎక్కువగా తెలుగు సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు దుల్కర్.

ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్‌లో హీరోగా నటిస్తూనే.. మరో రెండు సినిమాలకు కీలక పాత్రలకు సైన్ చేసారు.

బాలయ్య, బాబీ సినిమాతో పాటు, తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని మిరాయ్‌ మూవీలో దుల్కర్ నటిస్తున్నారని తెలుస్తుంది.

హిందీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలలు చేస్తు అన్ని భాషల్లో నటిస్తూ అసలు సిసలైన పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకుంటున్నారు దుల్కర్.