దూరమవుతున్న దుల్కర్... రీజనేంటి?
TV9 Telugu
08 March 2024
పేరుకి మలయాళ హీరో అయినా, ఎప్పుడో ప్యాన్ ఇండియా పర్సన్‌గా గుర్తింపు పొందారు మిస్టర్ దుల్కర్ సల్మాన్.
ఈ మలయాళీ స్టార్ హీరో ఏ లాంగ్వేజ్‌లో ఏ ప్రాజెక్ట్ చేసినా ఆ సినిమా మీద క్రేజ్ మాత్రం అమాంతం పెరుగుతుంది.
అలాంటిది ఇప్పుడు దుల్కర్... తమిళ స్టార్ కమల్‌హాసన్‌కి దూరం జరుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
లోకనాయకుడు హీరోగా మణిరత్నం దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం థగ్ లైఫ్ తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో నటించడానికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మల్లువుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.
కాకపోతే ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాకు, నెక్స్ట్ సూర్యతో చేసే సినిమాకు కాల్షీట్లు ఎక్కువగా అవసరమవుతున్నాయట.
అందుకే మణిరత్నం అడిగిన కాల్షీట్‌ని అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. ఈ విషయాన్నే మణిరత్నంతోనూ దుల్కర్ చెప్పినట్టు సమాచారం.
మణిరత్నం - దుల్కర్ కాంబోలో వచ్చిన ఓకే బంగారం సినిమాను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ రేంజ్ సినిమా ఇంకోటి వస్తుందనుకునే లోపు ఇలా జరిగింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి