లోకనాయకుడి కోసం వారిద్దరూ.. 

TV9 Telugu

17 April 2024

లోకనాయకుడు కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం థగ్‌లైఫ్‌.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ థగ్‌లైఫ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ థగ్‌లైఫ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇందులో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తున్నారు. తమిళ నటి ఐశ్వర్య లక్ష్మి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

గౌతం కార్తీక్, అభిరామి, నాసర్, జోజు జార్జ్ తిదితరులు ఈ యాక్షన్ డ్రామా సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి కీలక పాత్రల్లో నటిస్తారని గతంలో ప్రకటించారు.

అయితే ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ కారణంగా వారిద్దరూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నారని వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు మళ్లీ ఇద్దరూ ఈ సినిమా సెట్స్ కి హాజరవుతారన్నది కోలీవుడ్‌ చిత్రపరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది రానుందని తెలుస్తోంది.