స్టార్ హీరోల మూవీస్ సైన్ చేస్తున్న దుల్కర్. బాలయ్య ,కమల్ తో కూడా..

20 November 2023

ఓ వైపు హీరోగా నటిస్తూ, ఇంకో వైపు నెగటివ్‌ ఛాయలున్న కేరక్టర్లు చేయడమే ఇప్పుడున్న ట్రెండ్‌లో రిస్కీ ప్రాసెస్‌.

అయితే అంతకు మించి, మరో అడుగు ముందుకేస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌.

స్టార్‌ హీరోల సినిమాల్లో ఈక్వల్లీ ఇంపార్టెన్స్ ఉన్న కేరక్టర్లు చేస్తున్నారు ఈ మల్లు హీరో. 

రీసెంట్‌గా భగవంత్‌ కేసరితో హిట్‌ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ కీ రోల్‌ కోసం దుల్కర్‌ని తీసుకున్నట్టు టాక్‌ నడుస్తోంది. ఆల్రెడీ దుల్కర్‌ కమల్‌హాసన్‌ థగ్‌ లైఫ్‌లో నటిస్తున్నారు.

అటు సూర్య హీరోగా సుధ కొంగర డైరక్ట్ చేస్తున్న మూవీలోనూ కీ రోల్‌ చేస్తున్నారు. 

తెలుగులో రీసెంట్‌ హిట్‌ సీతారామమ్‌తో మంచి  మార్కెట్‌ క్రియేట్‌ అయింది దుల్కర్‌కి.  తెలుగులో హీరోగా లక్కీ భాస్కర్‌ మూవీలో నటిస్తున్నారు దుల్కర్‌.

ఆయన తెలుగులో హీరోగా  మూవీ యాక్సెప్ట్ చేశారంటేనే, తప్పకుండా ఏదో స్పెషాలిటీ ఉంటుందనే టాక్‌ మహానటి నుంచి క్రియేట్‌ అయింది.