దుల్కర్ మరో తెలుగు సినిమా.. సొంత ఇండస్ట్రీని వదిలేసినట్టేనా.?

Anil Kumar

08 July 2024

మహానటి, సీతా రామం, క్యామియో రోల్స్ తో సినిమాలతో  ఏకంగా తెలుగు హీరో అయిపోయారు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.

ప్రస్తుతం దుల్కర్ తో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి మన నిర్మాతలు సైతం పోటీ పడుతున్నారు అంటే నో డౌట్.

ఇప్పటికే సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో మీనాక్షి చౌదరితో జంటగా లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నారు దుల్కర్.

ఇది సెట్స్‌పై ఉండగానే.. పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

అసలు దుల్కర్ ప్లాన్ ఏంటి..? సొంత ఇండస్ట్రీని వదిలేసి.. పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఈ హీరో.

కెరీర్ మొదట్లో వరసగా మలయాళంలోనే నటించిన ఈయన.. కొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీ పై స్పెషల్ ఫోకస్ చేసారు.

ఈ క్రమంలోనే వెంకీ అట్లూరితో లక్కీ భాస్కర్‌లో నటిస్తూనే.. మరో రెండు సినిమాల్లో కీలక పాత్రలకు ఓకే చెప్పారు.

కల్కి అతిథి పాత్రలో నటించారు దుల్కర్ సల్మాన్. తేజ సజ్జా మిరాయ్‌లో దుల్కర్ సపోర్టింగ్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది.