దసరా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ చెప్పుకోదగ్గ సినిమాలేవీ రాలేదు. గతవారం విడుదలైన కీడా కోలా ఓకే అనిపించగా.. మా ఊరి పొలిమేర 2 బ్లాక్‌బస్టర్ అయింది.
ఇక ఈ వారం దివాళీ ఉన్నా.. కేవలం డబ్బింగ్ సినిమాలే వచ్చేస్తున్నాయి. వస్తుందనుకున్న వర్మ వ్యూహానికి సెన్సార్ చిక్కులు రాగా.. ఆదికేశవ వరల్డ్ కప్ కారణంగా వాయిదా పడింది.
దివాళి సీజన్‌ను పూర్తిగా వదిలేసారు మన హీరోలు. వాళ్ల తీరు చూస్తుంటే దసరా, సంక్రాంతికి మాత్రమే రావాలనుకుంటున్నారు.
మనోళ్లు వదిలేయడంతో.. తమిళ హీరోలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఈ వారం కార్తి జపాన్, లారెన్స్ జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాలు విడుదల అయ్యాయి.
ఇందులో కార్తి జపాన్‌పై అంచనాలు బాగానే పెరిగాయి. రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్.
కార్తి ఈ మధ్యే మంచి ఫామ్‌లో ఉన్నారు. దాంతో జపాన్‌కు తెలుగులోనూ ఓపెనింగ్స్ బాగానే వచ్చేయి. సినిమా ఆకట్టుకోలేకపోయింది.
మరోవైపు రాఘవ లారెన్స్ హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన జిగర్తాండ డబుల్ ఎక్స్ కూడా నవంబర్ 10నే విడుదలైంది.
ఈ రెండు మాత్రమే కాదు.. అలా నిన్ను చేరి, స్రవంతి రవికిషోర్ నిర్మించిన దీపావళి, సల్మాన్ ఖాన్ టైగర్ 3 కూడా దివాళీ వీకెండ్‌కు రిలీజ్ అవుతున్నాయి.