సంక్రాంతికి మన సినిమాలే కొట్టుకు చస్తుంటే.. మేమున్నాం అంటూ తమిళ హీరోలు కూడా వచ్చేస్తున్నారు. మరి అవి నిజంగానే వస్తాయా..? దీనిపై మన నిర్మాతలు ఏం మాట్లాడరా..?
సంక్రాంతికి మన హీరోలే మేమంటే మేమంటూ కొట్టుకుంటున్నారు. అసలు అన్ని సినిమాలు వస్తే థియేటర్స్ ఎలా అడ్జస్ట్ చేయాలా అని నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు.
ఇప్పటికే మహేష్ బాబు, వెంకటేష్, విజయ్ దేవరకొండ, తేజ సజ్జ, రవితేజ సహా.. మరో మూడు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.
సంక్రాంతి అనువాద సినిమాల విషయంలో తెలుగు నిర్మాతలు ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే లేదంటే ఉన్న పోటీకి మరింత వేడి రాజేయక తప్పదు.
ఎందుకంటే రజనీకాంత్ లాల్ సలామ్, శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాలు కూడా పండక్కే వస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.
డబ్బింగ్ మూవీస్ కూడా సంక్రాంతికే వస్తే.. మన సినిమాల పరిస్థితి ఏం కావాలి..? ఇదే మహేష్, వెంకటేష్, విజయ్ దేవరకొండల సినిమాలు పొంగల్‌కు తమిళంలో విడుదలైతే వాళ్లు థియేటర్స్ ఇస్తారా..?
దానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకుంటారా.. మరి మనం మాత్రం డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఎందుకివ్వాలనే ప్రశ్న రైజ్ అవుతుందిక్కడ. మొత్తానికి ఈ సారి పొంగల్‌కు వార్ ఎలా ఉండబోతుందో చూడాలిక.