02 October 2023
డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ ముగ్గురి కెరీర్స్‌కు అగ్నిపరీక్ష పెడుతుందా..? చివరి అవకాశంగా మారనుందా..? వరస ఫ్లాపుల్లో ఉన్న ఆ ముగ్గురు స్టార్స్‌కు ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చావో రేవో తేల్చబోతుందా..?
అసలు ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..? పూరీ ఎందుకు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు..? డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరీ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా..?
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ షూటింగ్ మొదలైంది.. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసారు పూరీ జగన్నాథ్.. సూపర్ ఫాస్టుగా షూట్ జరుగుతుంది.. అనుకున్న తేదీకి వచ్చేలా కూడా కనిపిస్తుంది.
అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.?? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం ఎవరూ చెప్పలేదు. దీనికి ఆన్సర్ మణిశర్మ అని తెలుస్తుంది.. తాజాగా ఈయన పేరే ఖరారైంది.
ఇస్మార్ట్ శంకర్ అంత పెద్ద విజయం సాధించిందంటే కారణం మణిశర్మ మాస్ మ్యూజిక్. ఖతర్నాక్ పాటలతో సినిమా రేంజ్ పెంచేసారు మణి. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇస్మార్ట్ శంకర్‌కు ప్రాణం.
దాంతో సీక్వెల్‌కు కూడా ఆయన్ని కాదని మరొకరి వైపు వెళ్లే ధైర్యం చేయట్లేదు పూరీ జగన్నాథ్. పైగా లైగర్ ఫ్లాప్‌తో ఆయన కెరీర్‌కు కూడా డబుల్ ఇస్మార్ట్ కీలకంగా మారింది.
అటు పూరీకి మాత్రమే కాదు.. ఇటు మణివర్మకు కూడా డబుల్ ఇస్మార్ట్ చివరి ఛాన్స్. ఆ సినిమా తర్వాత మణిశర్మకు ఆ రేంజ్ హిట్ రాలేదు. పైగా రామ్ కెరీర్ కూడా ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్ యావరేజ్.. వారియర్ ఫ్లాప్.. స్కందకు టాక్ ఏమంత గొప్పగా లేదు. దాంతో డబుల్ ఇస్మార్ట్‌తో ఫామ్‌లోకి రావాలని చూస్తున్నారు. మార్చ్ 8న విడుదల కానుంది ఈ చిత్రం.