డబుల్ ఇస్మార్ట్.. పెద్దలకు మాత్రమే.! సెన్సార్ కన్ఫర్మ్..
Anil Kumar
14 August 2024
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
మరీ ముఖ్యంగా యూత్ ఆయన సినిమాలకు బాగా కనెక్ట్ అవుతారు. పూరిజగన్నాథ్ పంచ్ డైలాగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
పూరితో మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అయ్యాడు రామ్ పోతినేని. డబుల్ ఇస్మార్ట్ శంకర్ రేపు విడుదల కానుంది.
తాజాగా రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా సెన్సార్ పూర్తైంది.
ఈ విషయాన్ని అధికారికంగా మాస్ పోస్టర్‌తో అనౌన్స్ చేసేసారు దర్శక నిర్మాతలు. దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చింది.
ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు హీరోయిన్ కావ్య తాపర్ గ్లామర్ షో కూడా బాగానే ఉందని గట్టిగా వినిపిస్తుంది.
అందుకే దీనికి "ఏ" సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. దీనిపై చిత్ర యూనిట్ కూడా అధికారకంగా స్పందించింది.
చూడాలి మరీ.. పూరీ లాస్ట్ మూవీ సక్సెస్ అవ్వకపోవడంతో ఆయన అభిమానులు ఈ సినిమాపై ఎన్నో అసలు పెట్టుకున్నరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి