మరో ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మహేశ్ బాబు

TV9 Telugu

15 June 2024

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

హిట్స్, ప్లాఫులతో మహేశ్ కు సంబంధం లేదు. రోజురోజుకీ ఆయన క్రేజ్, బ్రాండ్ వ్యాల్యూ భారీగా పెరుగుతోంది.

తాజాగా మరో ప్రముఖ కంపెనీకి  ప్రచారకర్తగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు నియమితులయ్యారు.

ఇన్నర్‌వేర్, ఔటర్‌వేర్‌ ఉత్పత్తులు తయారుచేస్తున్న డాలర్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీకి ప్రచారకర్తగా మహేశ్ ను నియమించారు.

దక్షిణ భారతదేశంలో మహేశ్ బాబును ప్రచారకర్తగా నియమించడం ద్వారా తమ పరిధి మరింత విస్తరిస్తుందని కంపెనీ అభిప్రాయపడింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో నటించాడు మహేశ్ బాబు.

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఓ అడ్వెంచెరస్ మూవీలో నటిస్తున్నాడు.

సుమారు 1000 కోట్లకు పైగానే బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని, ఇండియాలో హై బడ్జెట్ మూవీ ఇదేనని టాక్ వినిపిస్తోంది.