దీపిక అలాంటి అప్లాజ్‌ అందుకోవడం లేదా?

Prudvi Battula 

10 February 2025

ఆలియా పాపకు జన్మనిచ్చిన కొన్నాళ్లకే ఫిట్‌నెస్‌ క్లాసులకు వెళ్లసాగారు. మళ్లీ మునుపటి ఫిజిక్‌ని అటైన్‌ చేయగలిగానంటూ చాలా సందర్భాల్లో చెప్పారు.

మొదటి నుంచీ ఈ విషయంలో తాను తీసుకున్న జాగ్రత్తలు అలాంటివి అని ఓపెన్‌ స్టేట్‌మెంట్లు ఇచ్చారు ఆలియా భట్.

ఆలియా ఫాలో అయిన ప్లానింగ్‌ని దీపిక పట్టించుకోలేదా? కొన్నాళ్లు సినిమాలు చేయకుండా లీజర్‌గా ఉందామనే అనుకున్నారా?

పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా కాసింత సమయాన్ని పాపతో గడపాలనుకున్నారా? లేకపోతే.. ఫిజిక్‌ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు.. అనే చర్చ మొదలైంది నెట్టింట్లో.

పోస్ట్ డెలివరీ దీపిక చేసిన ర్యాంప్‌ వాక్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయిప్పుడు. చోకర్‌, క్రాస్‌ నెక్లెస్‌, కళ్లజోడుతో ర్యాంప్‌ వాక్‌లో మెరిశారు దీపిక పదుకోన్‌.

అయితే డయాస్‌ మీద మునుపటికన్నా కాసింత బొద్దుగా కనిపించారు. అసలు దీపికని పోల్చుకోవడానికి కూడా కొంత సమయం పట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ర్యాంప్‌ వాక్‌ స్టార్ట్ చేశారంటే, త్వరలోనే ఫిట్‌నెస్‌ క్లాసులు అటెండ్‌ అవుతారు. వీలైనంత స్పీడ్‌గా కమ్‌ బ్యాక్‌ ఇచ్చేస్తారనే టాక్‌ ముంబైలో మొదలైంది.

దీపిక కాల్షీట్స్ ఇస్తే, కల్కి2, పఠాన్‌2, బ్రహ్మాస్త్ర సీక్వెల్‌ క్యూలో కనిపిస్తాయి. కాకపోతే, మిగిలిన సాధ్యాసాధ్యాలను బట్టి ఏ ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది.