29 November 2024

రెండుసార్లు ప్రేమలో మోసపోయి విడాకులు తీసుకున్న హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. 

కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండుసార్లు ప్రేమలో మోసపోయింది. ఇద్దరు భర్తల మోసపూరిత ప్రేమకు బలైంది. 

తను మరెవరో కాదు బుల్లితెర నటి దల్జీత్ కౌర్. మొదటి భర్త షాలీన్ భానోట్ వేధిస్తున్నాడని.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని విడాకులు ఇచ్చింది.

దల్జీత్ కౌర్, షాలీన్ భానోట్ 2006లో టెలికాస్ట్ సీరియల్ 'కుల్వధు' సెట్స్‌లో కలుసుకున్నారు. కొన్నాళ్లకే ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. 

2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరికి బాబు జాడెన్ ఉన్నాడు. కానీ మనస్పర్థల కారణంగా దాదాపు 6 ఏళ్లకు విడాకులు  తీసుకున్నారు. 

డివోర్స్ తర్వాత 8 ఏళ్లు ఒంటరిగా ఉన్న దల్జీత్ కౌర్. కెన్యాకు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ పటేల్‌ను పెళ్లి చేసుకుని కొడుకుతో కెన్యాకు మారింది. 

కానీ కొన్ని నెలలకే భర్తతో విభేదాలు రావడంతో కొడుకుతో కలిసి భారతదేశానికి తిరిగి వచ్చింది. పెళ్లైన ఏడాదికే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 

కొన్ని నెలల క్రితమే దల్జీత్ భర్త నిఖిల్ ముంబై విమానాశ్రయంలో తన కొత్త స్నేహితురాలితో కనిపించాడు. ఇప్పుడు దల్జీత్ కొడుకుతో ఒంటరిగా ఉంటుంది.