16 May 2025
రాజమౌళి ఆఫర్స్ రెండు సార్లు రిజెక్ట్ చేసిన ఏకైక హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇమేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలో నటించాలని స్టార్ హీరోహీరోయిన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు.
కానీ ఓ హీరోయిన్ మాత్రం రాజమౌళి నుంచి ఆఫర్స్ ఏకంగా రెండుసార్లు రిజెక్ట్ చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..
ఆమె మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ త్రిష. ప్రస్తుతం నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తూ బిజీగా ఉంది ఈ వయ్యారి.
అయితే ఒకప్పుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాకు త్రిషను ఎంపిక చేయగా నో చెప్పేసిందట. ఆ సినిమా మరేదో కాదు సునీల్ హీరోగా వచ్చిన మర్యాదరామన్న.
అప్పటివరకు కమెడియన్ గా కొనసాగుతున్న సునీల్.. మర్యాద రామన్న సినిమాతో హీరోగా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇందులో ఫస్ట్ ఛాయిస్ త్రిష.
కానీ త్రిష అప్పటికే స్టార్ హీరోయిన్ కావడంతో మర్యాద రామన్న సినిమా చేయనని చెప్పేసిందట. దీంతో మర్యాద రామన్న సినిమాలో సలోనిని ఎంపిక చేశారు.
అయితే మర్యాద రామన్న సినిమాను త్రిష ఏకంగా రెండుసార్లు రిజెక్ట్ చేసిందట. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ.
ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో హిట్ అందుకున్న త్రిష.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర, తమిళంలో మరికొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్